చెర్రీ బాల్యం గురించి ఇవి తెలుసా.?

08 March 2025

Prudvi Battula 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 1985 మార్చి 27న చెన్నైలో జన్మించారు. 10వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.

చరణ్‏కు చిన్నప్పుడు చాలా సిగ్గు. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అల్లు అర్జున్, శిరీశ్, సాయి ధరమ్ తేజ్ స్టెప్పులేస్తుంటే.. చరణ్ ఒక్కసారి డాన్స్ చేశారట.

చిరంజీవి నటించిన రాజా విక్రమార్క, లంకేశ్వరుడు, ఆపద్భాంధవుడు సినిమా సెట్స్‏కు మాత్రమే చరణ్ వెళ్లారట. చిన్నప్పుడు సినిమాపై ధ్యాసే లేదట.

8వ తరగతి చదువుతున్నప్పుడు సినీ మ్యాగజైన్ చదవాలని ట్రై చేశారట. కానీ హఠాత్తుగా చిరంజీవి రావడంతో భయంతో వణికిపోయారట. అప్పుడే పెద్ద చర్చే జరిగిందట.

ఇంట్లో సినీ పత్రికలు, అవార్డులను తీసుకెళ్లలేదట చిరు. సినిమాలకు సంబంధించిన విషయాలన్ని ఆఫీసుకే పరిమితం చేశారట. పది తర్వాత చెర్రీకి సినీ ఫ్రీడమ్ ఇచ్చారట.

చరణ్‏కు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. బంధువులు, స్నేహితులకు వాటినే కానుకగా ఇస్తారట. చిన్నప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు చరణ్.

చరణ్ ఎప్పుడు చూసిన ఎక్కువగా మాల దీక్ష చేపడుతుంటారు. ఎందుకంటే మాల ధరిస్తే ప్రశాంత లభిస్తుందని.. క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశమట.

2012లో తన స్నేహితురాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు చరణ్. వీరికి దాదాపు 11 ఏళ్ల తర్వాత పాప జన్మించింది. తనకు క్లీంకార అని నామకరణం చేశారు.