ముద్దుగుమ్మ మృణాల్ ఆస్తిపాస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 

29 September 2025

Rajeev 

 కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత  సినిమాల్లో అవకాశాలు అందుకుంది మృణాల్.

మొదట్లో మరాఠీ భాషా చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

 లవ్ సోనియా, జెర్సీ, సూపర్ 30 వంటి చిత్రాలతో నార్త్ లో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత 2022లో విడుదలైన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఈ సినిమా ఆమె సినీ కెరీర్ లో పెద్ద మలుపు అనే చెప్పాలి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె.. చేతిలో 5కు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి

మృణాల్ ఆస్తుల విలువ రూ.40 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

ఆమె వద్ద హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్-బెంజ్ S450 కార్లు ఉన్నాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫాలోవర్ల సంఖ్య 15 మిలియన్లు దాటింది.