త్రిష ఒకొక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా.?

Rajeev 

07 June 2025

Credit: Instagram

త్రిష.. సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అందం, అభినయంతో సినీ పరిశ్రమను ఏలేస్తోంది. 

తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

ఓవైపు ఆమె నటించిన చిత్రాన్ని భారీ విజయాన్ని అందుకుంటున్నా.. పలు కారణాలతో నిత్యం వార్తలలో ఉంటుంది త్రిష.

ఇటీవలే పొన్నియిన్ సెల్వన్, లియో వంటి హిట్స్ తర్వాత త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అజిత్ సరసన విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో ఆకట్టుకుంది. 

జోడి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన తర్వాత మౌనం పెసియాదే మూవీతో హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.

తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. అలాగే బ్రాండ్ ఎండార్సమెంట్స్, ప్రమోషన్స్ ద్వారా త్రిష సంపాదిస్తుంది.