రష్మిక చేసిన తెలుగు సినిమాల్లో హిట్లు ఎన్నో తెలుసా.?
10 June 2025
Prudvi Battula
2018లో నాగ శౌర్యకి జోడిగా నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయినా రష్మిక మందన్న తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుంది.
అదే ఏడాది విజయ్ దేవరకొండకి జోడిగా రొమాంటిక్ కామెడీ 'గీత గోవిందం' సినిమా చేసింది. ఇది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
తర్వాత నానికి జోడిగా 'దేవదాస్' అనే యాక్షన్ కామెడీ చిత్రంలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
2019లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం 'డియర్ కామ్రేడ్'తో మరో విజయ్ దేవరకొండ సరసన కనిపించింది. ఇది యావరేజ్ అయింది.
2020లో మహేష్ బాబుకి జోడిగా యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'సరిలేరు నీకెవ్వరు'లో నటించింది. ఇది ఆ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
2020లో యంగ్ హీరో నితిన్ సరసన రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమా 'భీష్మ'లో కథానాయికగా చేసింది ఈ వయ్యారి భామ. ఈ సినిమా కూడా హిట్.
2021లో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్గా 'పుష్ప: ది రైజ్'లో చేసింది. ఇది పాన్ ఇండియా హిట్ కావడంతో నేషనల్ క్రష్ స్టేటస్ తెచ్చుకుంది.
2022లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో శర్వానంద్ సరసన నటించి మెప్పించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏవరేజ్ అనిపించింది.
2022లో హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ రొమాంటిక్ డ్రామా 'సీతా రామం'లో ఆఫ్రీన్ అనే కీలకపాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది.
2024లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న 'పుష్ప 2: ది రూల్' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్, అలాగే విజయ్ దేవేరకొండతో మరో సినిమా చేస్తుంది. ఈమె నటించిన కుబేర మూవీ జూన్ 20న విడుదల కానుంది.