14 September 2023

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ.. ఈసారి ఏకంగా డీజె టిల్లుతో రొమాన్స్‌

Pic credit - Instagram

బేబీ సినిమాతో.. ఇండస్ట్రీ బిగ్ హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య తాజాగా బంపర్ ఆఫర్ కొట్టారు.

ఏకంగా డీజే టిల్లుగా తెలుగు టూ స్టేట్స్‌ హార్ట్ గెలుచుకున్న సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే డీజే టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న డీజే టిల్లు స్క్వేర్ సినిమా షూట్‌తో బిజీగా ఉన్న సిద్ధు తాజాగా మరో సినిమా మొదలెట్టనున్నార.

బొమ్మరిల్లు ఫేం బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్లో.. ఓ రొమాంటిక్ డ్రామా కథలో యాక్ట్ చేయనున్నారు.

అయితే ఈ సినిమాలో తాజాగా బేబీ ఫేం వైష్ణవిని తీసుకునేందుకు ఫిక్స్ అయ్యారట డైరెక్టర్ భాస్కర్ అండ్ టిల్లు.

ఇక తాజాగా ఈ న్యూస్ బయటికి రావడంతో.. బేబీ, డీజే టిల్లు పై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.

పాపం డీజే టిల్లు.. రాధిక చేతిలో మోసపోయాడనుకుంటే.. ఇప్పుడు బేబీ చేతిలో కూడా.. మోసపోనున్నాడనే అనే ఫన్నీ కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.