03 AUGUST 2023
ఆ హీరోల సినిమాపై ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కె పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారట.
ప్రాజెక్ట్ కె చిత్రంలో ప్రభాస్ ను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించనున్నారట.
ఇక ఇప్పుడు మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది.
ఇందులో దీపికా కాకుండా.. మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ గ్లామర్ బ్యూటీ పై ఓ సాలిడ్ యాక్షన్ షూటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే దిశా పటానీ పై జరిగిన షూటింగ్ ప్రాజెక్ట్ కె కోసం కాదని ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో దిశా పటానీ మాత్రం మాస్ యాక్షన్ లుక్ ఉంటుందని తెలుస్తోంది.
దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి