పాన్ ఇండియా వద్దు.. రీజినల్ ముద్దు.. ఎవరా క్రేజీ దర్శకులు.?

31 December 2024

Battula Prudvi

టాలీవుడ్‌లో త్రివిక్రమ్ రేంజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఎంత క్రేజ్ ఉన్నా.. పాన్ ఇండియా వైపు వెళ్లలేదు గురూజీ.

ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్‌తో అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే ఈయన పక్కా తెలుగు దర్శకుడే.

సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా జపం చేయలేదు. చక్కగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ వరస విజయాలు అందుకుంటున్నారు.

ప్రస్తుతం వెంకటేష్‌తో చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాంపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది జనవరి 14న రానుంది.

దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కథ ఓకే చేయించుకున్నారు అనిల్ రావిపూడి. ఇది కూడా పూర్తి తెలుగు సినిమానే.

మరోవైపు బాబీ సైతం డాకూ మహరాజ్‌ను టాలీవుడ్‌కే పరిమితం చేసారు. ఇది సంక్రాంతి కనుక ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇన్నాళ్ళూ తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన గోపీచంద్ మలినేని.. బాలీవుడ్‌కు వెళ్లి సన్నీ డియోల్‌తో జాట్ తెరకెక్కిస్తున్నారు. ఇది కేవలం హిందీలోనే వస్తుంది.

సరైన సబ్జెక్ట్ దొరికనపుడే పాన్ ఇండియాకు వస్తామంటున్నారు ఈ దర్శకులంతా. అప్పటివరకు లోకల్‎లోనే అంటున్నారు.