దర్శకుడు శంకర్ వారసురాలిపై ఆఫర్ల వర్షం..

మూవీ ఇండస్ట్రీలో కుటుంబాల నుంచి వచ్చిన నటులకు, సాంకేతిక నిపుణలకు ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన వారి సంఖ్య తక్కువ.

అదే సినిమా ఫ్యామిలీ నుంచి వస్తే దర్శక, నిర్మాతలు క్యూ కడతారు.

ప్రస్తుతం దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ విషయంలో కూడా అదే జరుగుతుంది.

రెండు చిత్రాల్లో నటించిన ఆమె అంతగా ఆకట్టుకోలేక పోయింది.

మరో మూడు సినిమాల్లో నటిస్తుండగా రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.

కాగా ఆమె కెరీర్ విషయంలో శంకర్ ఎవరిని సంప్రదించడం లేదట.

శంకర్ అంటే ఉన్న గౌరవం దర్శక, నిర్మాతలు ఆమెకి ఆఫర్లు ఇస్తున్నారని తెలుస్తోంది.