ఆ స్టార్ హీరో సినిమాను శ్రీలీల రిజెక్ట్ చేసిందా.?
29 May 2025
Prudvi Battula
సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందd సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల.
మొదటి సినిమాలోనే అందం, అభినయం పరంగా శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వెంటనే ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ధమాకా సినిమా ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు.
అయితే రవితేజ ధమాకా సినిమా తర్వాత శ్రీలీల నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడ్డాయి. ఒక్క భగవంత్ కేసరి మాత్రమే హిట్ గా నిలిచింది.
గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు బాగా తగ్గాయి.
ఇదిలా ఉంటే శ్రీలీల ఓ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
కార్తీ హీరోగా నటిస్తోన్న సర్దార్ 2 సినిమాలో శ్రీలీలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
ఈ సినిమాలో తన పాత్ర తక్కువగా ఉండటంతోనే సర్దార్ 2ను నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రష్మిక తొలి సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా.?
వెంకీ దారిలోనే వారంతా.. ప్రొమోషన్స్ విషయంలో తగ్గదేలే..
సాయి పల్లవి డైరెక్షన్లో చైతు హీరోగా సినిమా వస్తుందా.?