కల్కికి ముందే తెలుగులో దీపికా సినిమా చేసిందా.?

Prudvi Battula 

14 February 2025

కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’తో చలనచిత్ర తెరంగేట్రం చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.

‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ వయ్యారి భామ అతి తక్కువ సమయంలోనే హిందీలో స్టార్ కథానాయకిగా ఎదిగింది.

‘కాక్‌టైల్‌’, ‘రేస్‌ 2’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పఠాన్‌’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో వైవిధ్య పాత్రలతో ఆకట్టుకుంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

అయితే దీనికి ముందు దీపికా తెలుగులో ఓ సినిమాలో నటించిన విషయం మీకు తెలుసా.? ఆ సినిమా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రణ్‌దీప్‌, మృదుల జంటగా ‘లవ్‌ 4 ఎవర్‌’ చిత్రంలో ప్రత్యేక గీతంలో దీపికా నటించినప్పటి.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు.

దింతో తెలుగులో పరిచయం కాలేకపోయిన ఈ బ్యూటీ కల్కితో తెలుగులో మెప్పించింది. గత జూన్ 27న వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది కల్కి.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన వంటి నటులు సైతం ఆకట్టుకున్నారు.