22 August 2023

చిరంజీవి ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు

తెలుగు సినీ ప్రపంచంలో అగ్రగామి నటుడిగా కీర్తి పొంది, ఎంతోమంది యువ నటులకు ఆదర్శమైన 'చిరంజీవి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 

ఇప్పటికే 150 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన చిరంజీవికి అన్యదేశ్య కార్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది.

దీని ధర సుమారు రూ. 8 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నట్లు సమాచారం. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే.

ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉండటం గమనార్హం. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తుంది.

చిరంజీవికి హైదరాబాద్ నగరంలో అత్యంత విశాలమైన & విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది రూ. 30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. 

ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది

1988లో నాగబాబుతో కలిసి 'అంజన ప్రొడక్షన్స్‌ హౌస్' స్థాపించారు.  మొత్తం మీద మెగాస్టార్ ఆస్తుల విలువ సుమారు రూ. 1650 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.