'దంగల్’ నటి సుహానీకి వచ్చిన ‘డెర్మటోమయోసైటిస్’ గురించి తెలుసా?

February  21, 2024

TV9 Telugu

'దంగల్’ నటి సుహానీ భట్నాగర్‌ అసలు పేరు కన్నీ బబితా కుమారిగానే అందరికి తెలుసు.‘దంగల్‌’ సినిమాలో చిన్ననాటి బబితా ఫోగట్‌ పాత్రలో నటించి మెప్పించింది

'బిగ్‌బాస్‌’ ఆరో సీజన్లో పాల్గొన్న సుహానీ ఆ తర్వాత పలు టీవీ సీరియళ్లలో నటించింది. తాజాగా ఆమె కేవలం 19 యేళ్ల వయసులోనే ‘డెర్మటోమయోసైటిస్‌’ అనే అరుదైన వ్యాధితో మృతి చెందింది. దీంతో ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలన్న ఆతృత ప్రస్తుతం అందరిలో పెరిగింది

ఇదొక ఆటో-ఇమ్యూన్‌ డిజార్డర్‌. చర్మంపై ర్యాషెస్‌తో మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్‌ కండరాల దాకా పాకుతుంది. క్రమంగా కండరాల్ని బలహీనపరిచి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది.

ఆమెకు వచ్చిన వ్యాధిని అందరూ తొలుత చర్మ సమస్య (ఎలర్జీ)గా భావించినట్లు భావించినా అసలు సమస్యను డాక్టర్లు ఎవరూ గుర్తించలేకపోయారు. ఎయిమ్స్‌కి వైద్యులు దీనిని డెర్మటోమయోసైటిస్‌గా గుర్తించారు

ఏ వయసు వారికైనా ఈ వ్యాధి రావచ్చంటున్నారు నిపుణులు. చర్మంపై ఎర్రటి దద్దుర్లు. ముఖం, కనురెప్పలు, ఛాతీ, గోరు క్యుటికల్‌, మోకాళ్లు, మోచేతులు.. వంటి భాగాల్లో కాస్త నీలం-పర్పుల్‌ రంగుల్లో ఉండే ర్యాషెస్‌ కనిపిస్తాయి

కండరాల్లో నొప్పి ప్రారంభమై శరీరంలోని ఒక్కో భాగంలోని కండరాలు బలహీనపరిచీ క్రమంగా ఆరోగ్యం క్షీణింప చేస్తుంది.ఈ బలహీనత మెడ దగ్గర్నుంచి మొదలై భుజాలు, తొడల దాకా పాకుతుందంటున్నారు నిపుణులు.

శరీరంలో క్యాల్షియం నిల్వలు తగ్గిపోవడం, విపరీతమైన అలసట, ఉన్నట్లుండి బరువు తగ్గడం, జ్వరం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే డెర్మటోమయోసైటిస్‌ వ్యాధి ఎందుకొస్తుంది అన్నదానికి కచ్చితమైన కారణాలేవీ లేవంటున్నారు నిపుణులు

రోగనిరోధక వ్యవస్థే తిరిగి ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేయడం వల్ల ఇలాంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధులు వస్తాయట. యూవీ రేడియేషన్‌, గాలి కాలుష్యం, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు వంటివి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి ఆటో-ఇమ్యూన్‌ వ్యాధికి దారి తీస్తుంది