పెళ్ళైన తగ్గేదే లే.. ఆ సినిమాకు రూ. 20కోట్లు డిమాండ్ చేస్తున్న దీపిక
19 May 2025
Rajeev
Credit: Instagram
దీపికా పదుకొణె ఇప్పుడు బాలీవుడ్‌లో నంబర్ 1 స్టార్ హీరోయిన్. ఇక కల్కి సినిమాతో దక్షిణాదిలోనూ ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది.
హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన దీపిక ఇప్పుడు సినిమా షూటింగులకు కాస్త విరామం ఇచ్చింది
కొన్ని రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు తన కూతురు ఆలనా పాలనలో బిజీ బిజీగా ఉంటోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ చిన్నది. 2018లో రణవీర్ సింగ్, దీపికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్ళైన దాదాపు ఆరేళ్ళ తర్వాత అంటే.. 2024లో ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
చివరిగా కల్కి సినిమాలో కనిపించిన దీపికా ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని టాక్.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో దీపికా నటిస్తుందని. ఇందుకు ఆమెకు రూ. 20కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.