వామ్మో.. కల్కికోసం దీపికా అంత తీసుకుంటోందా.? 

TV9 Telugu

11 February  2024

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె నటిస్తోన్న విషయం తెలిసిందే. 

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా కీలక పాత్రలో నటిస్తోంది. సుమారు రూ. 6000 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే సైంటిఫిక్‌ ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దీపిక పదుకొణె రోల్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. 

 ఈ సనిమాలో నటించేందుకు దీపికా భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటోంది అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

కల్కి మూవీ కోసం దీపికా ఏకంగా రూ. 30 కోట్ల పారితోషం తీసుకుంటోంది అనేది అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వినిపిస్తోన్న వార్త. 

ఇదిలా ఉంటే దీపికా తన కెరీర్‌లో తీసుకుంటున్న అత్యధిక రెమ్యునరేషన్‌ ఇదేనని తెలుస్తోంది. ఈ సినిమాకు దీపికా కాల్షిట్స్‌ సైతం ఎక్కువ ఇచ్చినట్లు టాక్. 

అంతకుముందు ఒక్కో సినిమాకు రూ. 12 నుంచి రూ. 15 కోట్లు తీసుకున్న దీపికా ఒక్కసారిగా రెమ్యునరేషన్‌ను పెంచేసిందని తెలుస్తోంది. 

కాగా సినిమాలో దీపికా రోల్‌ కూడా చాలా కీలకం కావడంతో, నిర్మాతలు సైతం ఒకే చెప్పేసినట్లు వార్తలు సమాచారం.