14 September 2023

అతి చేయొచ్చు కానీ.. మరీ ఇలా కాదు..! శివాజీ ఓవర్‌ యాక్షన్

Pic credit - Instagram

బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. మునుపటి సీజన్‌ కంటే.. కాస్త ఇంట్రెస్ట్‌గానే సాగుతుందనే టాక్ వచ్చేలా చేసుకుంది.

దాంతో పాటే.. ఈ సీజన్లోనూ.. తెలియని కంటెస్టెంట్సే ఎక్కువ ఉన్నారనే విమర్శలను కూడా వచ్చేలా చేసుకుంది.

ఇక ఈ కంటెస్టెంట్స్‌ అందర్లో.. అందరికీ తెలిసి వ్యక్తి  ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క హీరో శివాజీనే.

అయితే దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ ఆడుతూ.. గెలుపొందాలని చూడకుండా.. అన్నీ ఎక్స్‌ట్రాలు చేస్తున్నారు శివాజీ

అందరితో పోట్లాడుతూ.. అనవసరంగా కోపం తెచ్చుకుంటూ.. నాన్ సింక్‌గా డైలాగ్స్‌ చెబుతూ.. బీబీ లవర్స్‌లో వ్యతిరేకత వచ్చేలా చేసుకుంటున్నారు.

ఇక తాజాగా సెప్టెంబర్ 13న జరిగిన ఎపిసోడ్‌ చివర్లోనూ.. మరో సారి తన అతిని చూపించారు శివాజీ.

లాన్‌లో ఉన్న డంబెల్స్‌ను.. వెయిట్స్‌నూ.. విసిరేస్తూ.. కాసేపు నానా హంగామా చేశారు. 

చూసేవాళ్లకు అతి చేయొచ్చు కానీ.. మరీ ఇంత అతి చేస్తే బిబీ షోలో కష్టమే అని కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు శివాజీ.