Comedian Prudhvi Raj

క్రేజీ ఆఫర్ కొట్టేసిన పృథ్వీ.. ఆ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్..

09 August 2023

Pic credit - Instagram

Prudhvi Raj Picture

సినిమాల్లో కొన్ని పాత్రలు  చివరి వరకు కనిపించినా పెద్దగా ప్రభావం చూపవు. కానీ, కొన్ని పాత్రలు ఒక్క సీన్‌లో కనపడినా చాలు విపరీతమైన క్రేజ్ వస్తుంది.

Prudhvi Raj Photo

ఇటీవల వచ్చిన ‘బ్రో’ చిత్రంలో కమెడియన్‌ పృథ్వీరాజ్‌ పోషించిన శ్యాంబాబు పాత్ర సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయింది

Prudhvi Raj Image

రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారితీసిన ఈ పాత్ర కారణంగా నటుడు పృథ్వీకి ఒక బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఓ చిత్రం ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు.

‘శోభన్‌బాబు’ అనే పేరుతో తెరకెక్కనున్న ఓ కొత్త సినిమాలో  ‘శ్యాంబాబు’ పాత్ర ఏకంగా రెండు గంటలు ఉంటుందట.

‘‘ప్రముఖ రచయిత, దర్శకుడు నాకు ఒక బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్ర 1 నిమిషం 5 సెకన్లు మాత్రమే ఉంది.

ఆయన దర్శకత్వంలో చేయబోయే ‘శోభన్‌బాబు’ అనే  సినిమాలో రెండు గంటలు ఉంటాడు. నాకు అద్భుతమైన అవకాశం.

ఆ రచయిత, దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాను? తదితర వివరాలను త్వరలోనే తెలియజేస్తా. అది నా కెరీర్‌ను మలుపుతిప్పే చిత్రం అవుతుంది.

ఈ శ్యాంబాబును అప్పుడు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీ’’ అంటూ ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసారు పృథ్వీ.