19 August 2023

చియాన్ విక్రమ్ నయా స్టిల్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు తమిళ స్టార్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్. సినిమాకో ప్రయోగం.. కొత్త లుక్ తో ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నాడు విక్రమ్.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు విక్రమ్. చియాన్ విక్రమ్ గా తమిళనాట స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న ఈహీరో.

గెలుపు ఓటములకు బెదరకుండా.. తను అనుకున్న సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్నిహిట్ అయినా.. కొన్ని ఫట్అయినా.. ఏమాత్రం చెక్కు చెదరడంలేదు. 

ఆరు పదుల వయస్సు దగ్గరకొస్తున్నా.. అల్ట్రా స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్నాడు విక్రమ్. యంగ్ హీరోలు కూడా కుళ్లుకునేలా స్టూలిష్ గా కనిపిస్తున్నాడు విక్రమ్.

తాజాగా తంగలాన్‌  చిత్రంలోనటిస్తున్నాడు.  ఈసినిమాలో  డీగ్లామరైజ్‌డ్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు విక్రమ్. అది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక  విక్రమ్‌.. తాజాగా ఎవరూ ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి మారిపోయాడు. హ్యాండ్సమ్ స్టార్ అనే పదానికి అర్ధం తీసుకువచ్చాడు. 

గజినీ సినిమా గుండులుక్  లో ..  పొట్టిహెయిర్‌లో బ్లాక్‌ గ్లాగుల్స్‌ పెట్టుకుని  బ్రాండ్‌ కాస్ట్యూమ్‌లో స్టైలిష్‌గా మెస్మరైజ్‌ చేస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు విక్రమ్‌. 

తాజాగా విక్రమ్ సిరికొత్త అవతారం ఎత్తాడు.  ఇంతకీ ఈ లుక్‌ ఏదైనా ఫొటోషూట్‌కు సంబంధించిందా..? లేదా కొత్త సినిమా లుక్‌ అనేది తెలియాల్సి ఉంది.