చమ్మక్ చల్లో సినిమా సక్సెస్ కాలేదు. కానీ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన పైనా చిత్రంలో నటించింది.
అలాగే అల్లు అర్జున్ జోడిగా ఇద్దరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో నటించింది. రానాతో నేనే రాజు నేనే మంత్రి, గోపిచంద్ సరసన గౌతమ్ నంద వంటి చిత్రాల్లో నటించింది.
చివరగా 2022లో రిలీజ్ అయిన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.