ఒక్క హిట్ తో కుర్రాళ్ళ హాట్ ఫెవరేట్ గా మారిపోయింది.. ఇప్పుడు సీన్ మారిపోయింది

Rajeev 

03 January 2025

చాలా మంది అందాల భామలు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. 

బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చిన కూడా సాలిడ్ సక్సెస్ మాత్రం పలకరించడం లేదు. అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. 

తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. కానీ భారీ హిట్ మాత్రం రుచిచూడలేకపోతుంది. 

ఆమె మరెవరో కాదు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్ . ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ. 

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆతర్వాత కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాతో మెప్పించింది. 

ఆతర్వాత తమిళ్ లో బిజీగా మారిపోయింది. చాలా కాలం తర్వాత తెలుగులో సైంధవ్ సినిమా చేసింది కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. 

రీసెంట్ గా విశ్వక్ సేన్ తో కలిసి మెకానిక్ రాకీ అనే సినిమా చేసింది. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. జెర్సీ తప్ప తెలుగులో హిట్ కొట్టలేదు ఈ భామ. ఇప్పుడు బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో చేస్తుంది.