లేడీ విలన్ పెళ్లి ముచ్చట్లు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు చూశారా?
30 June 2024
TV9 Telugu
TV9 Telugu
లేడీ విలన్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి సందడి మొదలైంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో గ్రాండ్‌గా జరిగాయి
TV9 Telugu
ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వాటిలోని ఓ ఫొటోలో కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్‌ను ఆలింగనం చేసుకుంటూ కనిపించారు
TV9 Telugu
వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముంబయిలో జరిగినట్టు తెలిసింది. వీరి వివాహతంతు జులై 2న వివాహం జరగనుంది
TV9 Telugu
వరలక్ష్మి ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసి పెళ్లికి ఆహ్వానించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా కొత్త పెళ్లికూతురు సోషల్ మీడియాలో పంచుకుంది
TV9 Telugu
ఇక ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులకు కూడా వరలక్ష్మి, నికోలయ్‌లు స్వయంగా శుభలేఖ అందించి, తమ వివాహానికి రమ్మని కోరారు
TV9 Telugu
సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తన వైవిధ్యమైన నటన, విలన్ పాత్రలతో వరలక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు
TV9 Telugu
'సర్కార్', ‘క్రాక్’, 'యశోద' వంటి తదితర చిత్రాల్లో నెగెటివ్ పాత్రలు పోషించి విశేషంగా అలరించారు. దీంతో వరలక్ష్మి నెగెటివ్ రోల్ చేసిన సినిమా బంపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ అందరిలోకి వచ్చేసింది
TV9 Telugu
ముంబయికి చెందిన వ్యాపారవేత్త, ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌తో దాదాపు ఏడేళ్లు ప్రేమాయణం నటిపిన ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు టాక్