టాలీవుడ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ భామ 

18 November 2025

Pic credit - Instagram

Rajeev 

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు హిందీలో సెటిల్ అయిన భామ.. ముందుగా తెలుగులోనే నటించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది.

ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో ఆదిపురుష్ చిత్రాల్లో నటించింది. 

 కానీ ఎక్కువగా హిందీలోనే నటిస్తుంది ఈ అమ్మడు. ఓవైపు కథానాయికగా రాణిస్తూనే మరోవైపు కాస్మెటిక్ వ్యాపారరంగంలో రాణిస్తుంది.

2021లో మిమి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు జాతీయ అవార్డు అందుకుంది. 

కృతి సనన్ తన బ్యూటీ బ్రాండ్ హైఫెన్ రెండవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. రెండు సంవత్సరాలలో హైఫెన్ రూ.400 కోట్లకు పైగా సంపాదించింది.

కృతి సనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.