సల్మాన్ ఖాన్ సరసన వీర్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది జరీన్ ఖాన్. తర్వాత రెడీ సినిమాలో ధీలా హైలో పాటలో కనిపించింది.
ఆమె హేట్ స్టోరీ 3, అక్సర్ 2, హౌస్‌ఫుల్ 2, వాజా తుమ్ హో, 1921 (2018) మరియు ఇతర చిత్రాలలో కూడా నటించింది.
ఇటీవల నటి జరీన్ తీవ్ర జ్వరం, నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు డెంగ్యూ సోకినట్లుగా వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం కోలుకుంటుంది.
ఈ విషయాన్ని స్వయంగా నటి తన ఆసుపత్రి గదిలో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. డెంగ్యూ వ్యాప్తి జాగ్రత్తలు ఫ్యాన్స్‌కు తెలుపుతూ రాసుకొచ్చింది.
డెంగ్యూ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులను కోరింది. దోమల వర్షాకాలాన్ని ఉపయోగించగలవని తెలిపింది.
రక్షణ దుస్తులు ధరించడం, పరిసరాలను శుభ్రంగా, దోమల రాకుండా చూసుకోవాలని అభిమానులకు సూచనలు చేసింది నటి జరీన్ ఖాన్.
ఇటీవల ముంబైలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. లెక్కల ప్రకారం ఆగస్టు 2023 మొదటి వారంలో 157 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఆగస్టు 13 వరకు 317 కి పెరిగింది.
బిగ్ బాస్ OTT 2 ఫైనలిస్ట్ అభిషేక్ మల్హాన్ డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పాపులర్ షో ఫైనల్స్ కు దూరమయ్యారు.