10 AUGUST 2023

నన్ను చాలా మంది ఎగతాళి చేశారు.. 'హృతిక్‌ రోషన్‌' ఎమోషనల్..

బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ గా హృతిక్ కు పేరుంది. ఆయన నటన గురించి ఎంత చెప్పిన తక్కువే.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు హృతిక్.

ఎన్నో వైవిధ్య మైన పాత్రల్లో నటించి మెప్పించారు.. మెప్పిస్తున్నారు. హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గానూ నటించి ఆకట్టుకున్నారు.

ఇక ఆయన యాక్షన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే .. సిక్స్ ప్యాక్ బాడీతో దుమ్మురేపుతాడు హృతిక్ రోషన్.

రీసెంట్ గా హృతిక్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

కోయ్‌.. మిల్‌ గయా సినిమా లో రోహిత్ పాత్రలో జరిగినట్టే నాకు చాలా సార్లు జరిగింది.

స్కూల్ లో ఉన్న సమయంలో నన్ను నా సీనియర్స్ ఏడిపించేవారు అని తెలిపాడు.. 

స్కూల్ డేస్ లో తాను కొన్ని అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు హృతిక్.

స్కూలుకు వెళ్లే రోజుల్లో నాకు నత్తి ఉండేది. అది చూసి అందరూ వెక్కిరించేవారు. నేనేం మాట్లాడినా ఎగతాళి చేసేవారు.

చాలా అవమానించారు అని తెలిపారు హృతిక్. అంతే కాదు నా ప్రాణం అయినటువంటి నా సైకిల్‌ను నాశనం చేశారు.

అందువల్లే నేను ఆ సినిమాలో అంత సహజంగా నటించాను అని తెలిపారు హృతిక్.