క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ ప్రియాంక.. తెలియక చేశానంటూ..  

05 December 2024

Rajeev 

సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయ్యింది ప్రియాంక జైన్. తన అందం, అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 లో అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో మెప్పించి ఏకంగా టాప్-5లో నిలిచింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అందరికీ పరిచయం చేసిందీ ఈ భామ. 

గత కొన్నేళ్లుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఎంతో సరదాగా ఉండే ప్రియాంక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది ప్రియాంక.  అక్కడ కూడా ఓ ఫ్రాంక్ వీడియో చేసింది. 

చిరుత పులి వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి రీల్ చేశారు. దాంతో ప్రియాంక పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 

తాజాగా  ఈ జంట తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని.. తెలియక తప్పు చేశామని... తమను అందరూ క్షమించాలని కోరారు.