‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొనసాగింపుకు భారీ ప్రణాళికలు..

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు రాజమౌళి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ప్రభంజనం సృష్టించారు.

ప్రస్తుతం మహేశ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

తాజాగా రాజమౌళి తదుపరి చిత్రాల గురించి కొన్న ఆసక్తికర విషయాలు వెల్లడించారు రచయిత విజయేంద్రప్రసాద్‌.

మహేశ్‌ చిత్రం తర్వాత మహాభారతం రంగంలోకి దిగనున్నట్లు తెలిపారు.

అలాగే రాజమౌళి పర్యవేక్షణలో  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొనసాగింపు చిత్రం ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌గా రానుందని అన్నారు.

దీని కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు అయన.

మహేశ్‌తో రూపొందనున్న చిత్రం సాహసాల నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని మించి భారీ స్థాయిలో ఉండనుందని పేర్కొన్నారు.

త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ చిత్రం కోసం మహేశ్‌ కొన్ని నెలలపాటు ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నట్టు తెలుస్తోంది.