11 August 2023

 'భోళాశంకర్​' మూవీ ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??

మెగాస్టార్​ చిరంజీవి లీడ్​ రోల్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్​'. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్​ అందుకుంటోంది. ఈ క్రమంలో తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ సైతం బాగా పెరుగుతున్నాయని టాక్​. 

ఈ మూవీ పైనున్న భారీ అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.

అయితే ఎట్టకేలకు ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు మూవీ యూనిట్​ వెల్లడించింది.

'భోళాశంకర్' టైటిల్ కార్డ్స్‌పై వేసి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా తాజాగా ఓ సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సినిమా థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. 

దాని ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 2వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

యూఎస్ ప్రీమియర్స్​ను చూసిన అభిమానులు ఈ సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు.  చిరు మాస్​ లుక్స్, అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ హైలైట్​గా నిలిచిందని ఫ్యాన్స్​ మాట.