ఆ రోజున ప్రేక్షకుల ముందుకు భగవంత్ కేసరి..

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి.

అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.

కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయక.

ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా కనిపించనుంది శ్రీలీల.

తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

ఈ చిత్రం అక్టోబర్ 19న థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ కూడా పోస్ట్ చేశారు మేకర్స్.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.