యువతి బర్త్ డే సెలబ్రేట్‌ చేసిన బాలయ్య.. ఆమె ఎవరంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలియని వారుండరు.

తాజాగా అమెరికా ఫిలడెల్ఫియాలో తానా సభల్లో అయన పాల్గున్నారు.

ఈ సభలు జులై 7వ తేదీ నుంచి 9వరకు ఘనంగా నిర్వహించారు.

ఆ సంబరాల్లో బాలకృష్ణ కుటుంబంతో పాటు  ఓ యువతి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఆ యువతి ఎవరని నెట్టింట తెగ వెతికేస్తున్నారు బాలయ్య అభిమానులు.

తానా సభలో తన అభిమానినని, ఈరోజు తన పుట్టినరోజని బాలయ్యను ఆశీర్వదించమని ఓ యువతి కోరింది.

దీంతో వెంటనే  కేక్‌ తెప్పించి ఆమె బర్త్ డే సెలబ్రేట్‌ చేశారు అయన.

ఆయన సతీమణి వసుంధరతో కలిసి కేక్ కట్ చేయించి, ఆ యువతిని ఆశీర్వదించారు.

ఆ అభిమానికి లైఫ్ లాంగ్ మరచిపోలేని జ్ఞాపకాన్న అందించారు బాలయ్య.