22 August 2023

ఆ విషయం లో బాలకృష్ణ ఆ అరుదైన రికార్డ్ ను సాధిస్తారా ??

 బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను సాధించి ఓవర్సీస్ లో వేర్వేరుగా మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించాయి. 

"భగవంత్ కేసరి" కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధిస్తే ఓవర్సీస్ లో హ్యాటిక్ మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించిన ఘనత బాలయ్య సొంతమవుతుంది. 

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఎవరూ ఈ రికార్డ్ ను సాధించలేదు. బాలయ్య ఈ అరుదైన ఘనతను కచ్చితంగా సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అనిల్ రావిపూడి సినిమా అంటే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లను సాధిస్తాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.  గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాల స్క్రిప్ట్ ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తనకు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే టాలెంట్ ఉన్న దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు. 

బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో సాంగ్స్, యాక్షన్ సీన్స్, బీజీఎం స్పెషల్ గా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కాజల్, శ్రీలీల ఈ సినిమాలో నటిస్తుండగా ఆయా హీరోయిన్ల ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.

బాలయ్య  స్టైల్ కు అనుగుణంగా అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య దసరాకు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాలి.