మోక్షజ్ఙ పై అసహనం వ్యక్తం చేస్తున్న బాలయ్య ఫ్యాన్స్
ఇప్పుడే కాదు.. గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే న్యూస్ బాలయ్య వారసుడి ఎంట్రీపైనే అందరి ఫోకస్.
కానీ.. మోక్షజ్ఙ ఇంకా తెరవెనుక ఉండడమే అభిమానులను అయ్యేలా చేస్తోంది ఫీల్.. దీంతో సోషల్ మీడియా వేదికపై కాస్త వైల్డ్ అండ్ డిస్సపాయింటెడ్ రియాక్షన్ వస్తోంది.
మొన్న ఈ యంగ్ లయన్ బర్త్ డే రోజు కావడంతో.. మరో సారి బాలయ్య సన్ ఎంట్రీ పై నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
నట సింహం బాలయ్య వారసుడిగా.. ఇప్పటికే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మోక్షజ్ఙ వైపే నందమూరి అభిమానులందరూ ఈగర్ గా చూస్తున్నారు.
ఈ యంగ్ లయన్ ఎంట్రీ .. ఇదిగో ఇప్పుడే.. అంటూ వచ్చే న్యూసులను యేటికేడు ఫాలోవుతూనే ఉన్నారు.
ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మోక్షజ్ఙ మ్యాజిక్ చేస్తారని ఎగ్జైట్ అవుతూ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే కాస్త అసహనానికి కూడ లోనై.. ఫీలవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
ఇక సెప్టెంబర్ 6తో 29 పడిలోకి అడుగుపెట్టిన మోక్షజ్ఙ.. ఈ బర్త్ డే ను కూడా.. సాధాసీదాగా.. బాలయ్య అబ్బాయిగానే జరుపుకుంటున్నారు.
దీంతో ఈ సారి కూడా బాబు ఎంట్రీ లేనట్టే అని ఫీలవుతున్నారు బాలయ్య హార్డ్ కోర్ అభిమానులు. అంతేకాదు డిస్సాపాయింట్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు.