బాబాయ్‌లాంటి వాడే నన్ను.. అలా వేధించాడు

27 October 2025

Pic credit - Instagram

Phani Ch

ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ కుర్రకారు క్రాష్ లిస్ట్ లోకి చేరిన కొత్త పేరు 'ఆయేషా ఖాన్'.

ఎవరు ఈ 'ఆయేషా ఖాన్' అనుకుంటున్నారా ?? అయితే మీకంటే ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది ఈ ముద్దుగుమ్మ

2022 లో 'ముఖచిత్రం' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయైంది హిందీ భామ అయేషా ఖాన్. దీని తర్వాత హిందీ బిగ్‌బాస్‌లో సత్తా చాటింది.

ఈ చిన్నది హిందీ బిగ్ బాస్ 17 షోలో పాల్గొని రచ్చ లేపింది. హౌస్ నుంచి బయటకు వచ్చాకా అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇది ఇలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో అయేషా మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా.. తినడానికి  తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు అని తెలిపింది

చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. చిన్న వయసులో నేను రోడ్డు పై నడుస్తున్నప్పుడు నన్ను వెనకనుంచి ఒకరు పిలిచారు.

ఆయన మా నాన్న స్నేహితుడు. బాబాయ్ అని వెనక్కి తిరిగి చూస్తే అతను నా దగ్గరకు వచ్చి నీ వక్షోజాలు బాగున్నాయ్ అని చెప్పి బైక్ పై వెళ్ళిపోయాడు.

ఆ క్షణం నాకు ఏం అర్ధం కాలేదు. చూస్తూ ఉండిపోయా.. అతను మళ్లీ తిరిగి వచ్చి కన్ను కొట్టి పిచ్చి సైగలు చేశాడు అని తెలిపింది.