Ravi Kiran
16 June 2024
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల భామ అవికా గోర్. ఆ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలజాంపాల సినిమాతో హీరోయిన్‌గా మారింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
ఆతర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాదు హిందీలోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
అలాగే ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్ లోనూ మెరిసింది ఈ వయ్యారి భామ. అంతే కాదు గ్లామర్ గేట్లు ఎత్తేసి కుర్రకారును కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది ఈ చిన్నది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవికా మాట్లాడుతూ రొమాంటిక్ సీన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
1920 అనే ఓ హర్రర్ సినిమా చేసింది ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. దేనికి గురించి మాట్లాడుతూ..
శృంగార సన్నివేశాలు సరదాగా ఉంటుందని భావిస్తారు కానీ.. అవి చాలా బోరింగ్‌గా ఉంటాయి అని తెలిపింది. అవికా అలాగే అలాంటి సీన్స్ చేసేటప్పుడు ఏది అవసరమో అది చేస్తున్నామనే ఫీలింగ్ తప్ప మరొకటి ఉండదు అని చెప్పుకొచ్చింది.