7 ఏళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత జీవితం మొత్తం మారిపోయింది.. హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
28 May 2026
‘చిన్నారి పెళ్లికూతురు’ (బాలికా వధు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా విశేష గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్. ఈ సీరియల్ ద్వారా తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మెప్పించింది. తాజాగా ఆమె నటించిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న అవికా తన ప్రేమ, పెళ్లి ,వ్యక్తిగత జీవితంపై మాట్లాడింది. తాము ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న తర్వాతే పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది.
తన భర్త కార్పొరేట్ రంగంలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అని తెలిపింది. ప్రస్తుతం తాము బ్యాంకాక్‌లో నివసిస్తున్నట్లు చెప్పింది.
మొదట్లో తమ ప్రేమపై తల్లిదండ్రులకు కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, ఆరు నెలల్లోనే వారు తమ బంధాన్ని అర్థం చేసుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొంది
పెళ్లి తర్వాత తన జీవితం చాలా పాజిటివ్‌గా మారిపోయిందని అవికా ఆనందం వ్యక్తం చేసింది. తామిద్దరం వేర్వేరు రంగాల్లో ఉన్నప్పటికీ ఒకరి కెరీర్‌ను మరొకరు గౌరవిస్తామని తెలిపింది.
నేను జెన్ జీ తరం అమ్మాయినే అయినా.. నా ఆలోచనలు, నమ్మకాలు మాత్రం చాలా సంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఇప్పటికీ నేను పాతకాలపు లవ్ లెటర్స్‌ను నమ్ముతానని తెలిపింది.
సినిమాల షూటింగ్స్ ఉన్నప్పుడు ఇండియాకు వస్తూ, మిగతా సమయాన్ని భర్తతో బ్యాంకాక్‌లో గడుపుతూ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నట్లు వివరించింది. ఇప్పుడు సినిమాల్లో తిరిగి బిజీగా మారింది.