అశ్విన్‌బాబు కొత్త చిత్రం.. ఆ పేరు ఖరారు..

2 August 2023

అశ్విన్‌బాబు హీరోగా షణ్ముఖ పిక్చర్స్‌ పతాకంపై ఓ మూవీ రూపొందుతుంది.

పాలక్ లల్వానీ ఈ చిత్రానికి కథానాయక

ఈ చిత్రాన్ని మామిడాల ఎం.ఆర్‌.కృష్ణ తెరకెక్కిస్తున్నారు.

ఆలూరి సురేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆలూరి హర్షవర్ధన్‌ చౌదరి ఈ సినిమాలు సమర్పిస్తున్నారు.

మంగళవారం అశ్విన్‌బాబు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ చిత్రం టైటిల్ అధికారికంగా ప్రకటించారు.

మెడికో థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే పేరు ఫిక్స్ చేశారు.

మలుపులతో కూడిన కథనంతో అశ్విన్‌ సరికొత్త లుక్‌తో కనిపిస్తారని తెలిపింది చిత్రబృందం.