క్యాజువల్ లుక్‌లోనే కేక పెట్టిస్తున్న అపర్ణ బాలమురళి

Phani CH

31 December 2024

అపర్ణ బాలమురళి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎప్పటికప్పుడు తన ఫోటోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

2015 లో వచ్చిన ఓరు సెకండ్ క్లాస్ యాత్ర అనే ఒక మలయాళీ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తరువాత సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో అపర్ణా బాలమురళీ లుక్స్ కు  తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

అంతేకాదు.. సంప్రదాయ చీరకట్టులో అచ్చం తెనుగింటి అమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అపర్ణ.

ఈ సినిమాతో సూపర్ హిట్‌ సక్సెస్ అందుకొని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ అపర్ణా బాలమురళీ.

అయితే సినిమా కెరీర్‌ ప్రారంభంలో తాను బాడీ షేమింగ్‌ని ఫేస్‌ చేసినట్టు తెలిపారు హీరోయిన్ అపర్ణ బాలమురళి.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో ధనుష్‌ తో చేసిన రాయన్‌ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని తెలిపారు అపర్ణ బాలమురళి.