ఆ హీరో షెఫ్ జీతం రోజుకు రూ.2 లక్షలు.. తినేది పిట్టమెతుకులే!
21 June 2024
TV9 Telugu
TV9 Telugu
స్టార్ హీరోల పారితోషికం గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చర్చ సాగుతుంటుంది. ఒకప్పుడు లక్షల్లో ఉండే వీరి పారితోషికం ఇప్పుడు వందల కోడ్లకు డిమాండ్ చేసే స్థాయికి వచ్చింది
TV9 Telugu
దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఓ హీరోకు వంట చేసే వ్యక్తి రోజుకు రూ.2 లక్షలు పారితోషికం డిమాండ్ చేయడం విడ్డూరంగా అనిపించిందన్నారు
TV9 Telugu
ఓ హీరో చెఫ్ రోజుకు రూ.2 లక్షలు ఇవ్వమని అడిగేవాడు. అతడు చేసే వంట ఓ పక్షి తినేంత ఉంటుందంతే! ఇదేంటి..? ఇది భోజనమా.. పక్షి దాణా అనే సందేహం కలిగింది
TV9 Telugu
మరీ ఏదో పక్షికి వేసినట్లు ఇంత తక్కువ పెడితే ఏం సరిపోతుందని ఆ హీరోను అడిగాను. అయితే ఆ హీరోకు ఏదో అనారోగ్య సమస్య ఉందట.. అందుకోసమని తక్కువ పరిమాణంలోనే తినాలని చెప్పాడు
TV9 Telugu
ఈ మాత్రం దానికి ఒక్కరోజుకు అతని చెఫ్‌కు రూ.2 లక్షలు ఇవ్వాలా? అనిపించింది. హెయిర్, మేకప్ ఆర్టిస్టులు కూడా రోజుకు రూ.75,000 డిమాండ్ చేస్తున్నారు. సినిమా కోసం పని చేసే టెక్నీషియన్లు కూడా అంత సంపాదించలేరు
TV9 Telugu
నేను హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్‌గా ఉండి ఉంటే, ఈపాటికి చాలా ధనవంతుడై ఉండేవాడిని. నిజానికి ఇది నిర్మాతలు, వారి ఏజెంట్ల తప్పు. నిర్మాతలు తమ సెట్స్‌పైకి ఇలాంటి వారిని ఎందుకు అనుమతిస్తారో నాకు తెలియదు
TV9 Telugu
వాళ్లు అడిగినదానికల్లా తలూపుతూ ఉంటారు. నా సెట్స్‌లో అయితే ఇలాంటి డిమాండ్స్ అస్సలు ఒప్పుకోనని చెప్పుకొచ్చాడు. నటుల గొంతెమ్మ కోరికలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా స్పందించారు
TV9 Telugu
ఇక సినిమాల విషయానికొస్తే.. అనురాగ్ కశ్యప్ బ్యాడ్ కాప్ అనే వెబ్ సిరీస్‌లో విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అతని తదుపరి మువీ కెన్నెడీ విడుదలకు సిద్ధంగా ఉంది