ఆచితూచి అడుగులేస్తున్న అందాల భామ అనుపమ.. 

16 November 2025

Pic credit - Instagram

Rajeev 

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు.

అద్భుతమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

2015లో అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం "ప్రేమమ్" సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

మొదటి సినిమాతోనే యాక్టింగ్...ఉంగరాల జుట్టుతో అందరి దృష్టిని కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో త్రివిక్రమ్ తెరకెక్కించి అఆ సినిమాలో నటిచింది.

అఆ సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో అరంగేట్రం చేసిన అనుపమ.. శతమానం భవతి మూవీతో హీరోయిన్ గా మారింది. 

ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ కూడా పెరిగింది.