తెలుగులో ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచింది అనుపమ పరమేశ్వరన్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి..
ప్రేమమ్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది
సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ సినిమాలో కనిపించింది. ఈ చిత్రంలో గ్లామర్ బ్యూటీగా కనిపించి షాక్ ఇచ్చింది.
ఇటీవల వరుసగా సినిమాలను వదిలింది. పరదా, కిష్కిందపురి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనుపమ.. మొన్నామధ్య లవ్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది.
‘ఐ లవ్ యూ ఎప్పటికీ’ అని చెప్పడం అతి పెద్ద అబద్ధమని, ట్యాక్సీ ప్రేమ నుంచి పారిపోవాలంటూ ప్రేమికులకు సలహా ఇస్తూ పోస్ట్ పెట్టింది.
“నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాను అన్నది ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధం. ఎప్పుడూ అలసిపోయే ట్యాక్సీ ప్రేమను వదిలేసి అలాంటి ప్రేమకు దూరంగా పారిపో” అంటూ రాసుకొచ్చింది