నేచురల్ స్టార్ కొత్త చిత్రంలో ఆ యంగ్ హీరో..

తన సహజ నటనతో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు నాని.

ఇండస్ట్రీలో సొంత కష్టంతో ఎదిగిన హీరోలలో నాని ఒకరు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై స్టార్ హీరోగా మంచి క్రేజీ తెచ్చుకున్నారు.

ఇటీవల దసరా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు అయన.

ఈ చిత్రంతో లవర్ బాయ్  బోర్డర్ దాటి మాస్ పాత్రలో నటించి మెప్పించాడు.

ప్రస్తుతం కొత్త టాలెంట్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

నాని 30 వర్కింగ్ టైటిల్ తో తారకేక్కుతున్న ఈ చిత్రంలో  మృణాల్ ఠాకూర్ హీరోయిన్.

తండ్రి కూతురు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ మరో కథానాయకిగా కనిపించనుందట.

ఈ చిత్రంలో బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.