ప్రభాస్‌- అనుష్క జంటగా మరో చిత్రం..

30-JUlY-2023

ఇండస్ట్రీలో ప్రభాస్‌ - అనుష్క అంటే హిట్‌ పెయిర్‌.

వీరిద్దరూ జంటగా గతంలో బిల్లా, మిర్చి, బాహుబలి సీరిస్‌లతో మెప్పించారు.

ఇపుడు వీరిద్దరూ జంటగా మరో సినిమా రానున్నట్లు సమాచారం.

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి వీరి కోసం మరో పిరియాడికల్‌ కథను రెడీ చేశారట.

ఈ కథని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా వినిపించారని తెలుస్తోంది.

వారికి కథ నచ్చడంతో ఈ మూవీ నిర్మించడానికి సిద్దమైనట్లు బలమైన ప్రచారం జరుగుతుంది.

అటు ఈ సినిమాకి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇది నిజమైతే మళ్లీ ప్రభాస్- అనుష్కను జంటగా వెండితెరపై చూడవచ్చు.