20 August 2023

సినిమాలకు పెద్ద ప్లస్ అవుతున్న అనిరుద్ మ్యూజిక్..

సినిమాకు మిడాస్‌ టచ్‌ ఇచ్చే మ్యూజిక్‌ డైరక్టర్‌గా ట్రెమండస్‌ సక్సెస్‌ రేషియో దూసుకుపోతున్నారు అనిరుద్‌.

సూపర్‌స్టార్స్, యంగ్‌స్టర్స్ అనే తేడా లేకుండా క్రేజీ ప్రాజెక్టులన్నిటికీ నేనే మ్యూజిక్‌ అంటున్నారు ఈ యంగ్‌స్టర్‌. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కుమ్మేయాలి.

 సౌండ్‌తో స్క్రీన్లు చినిగిపోవాలంటే నిన్నమొన్నటిదాకా మన ముందున్న మ్యూజికల్‌ ఆప్షన్‌ పేరు తమన్‌. కానీ ఇప్పుడు..

ఆ మాటను బీట్‌ చేయడానికి నేనున్నా.. స్కోర్‌ షేరింగ్‌కి సిద్ధంగా ఉండండి అనే వాయిస్‌ వినిపిస్తోంది అనిరుద్‌ నుంచి.

వా… నువ్‌ కావాలయ్యా అని స్క్రీన్‌ మీద అన్నది తమన్నానే అయినా.. మేకర్స్ మాత్రం అనిరుద్‌ వైపు చూస్తున్నారు.

జైలర్‌తో ఆల్రెడీ తమిళనాడుని కమ్మేసిన అనిరుద్‌ నెక్స్ట మంత్‌ జవాన్‌తో షారుఖ్‌ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ప్లాన్‌ చేశారు. 

ఇక ఇప్పుడు తమిళ్‌, హిందీలో మాత్రమే కాదు, తెలుగులోనూ జోరు పెంచుతున్నారు అనిరుద్‌ రవిచంద్రన్. 

ఒక రకంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఒత్తిడి మేరకే దేవరలో అనిరుద్‌కి ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్ కొరటాల శివ.

మరియు అటు విజయ్‌ దేవరకొండ సినిమాకు కూడా అనిరుద్‌ ఇచ్చే ట్యూన్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.