యానిమల్ పార్ట్ 3 ఉందా.?
10 December
2024
Battula Prudvi
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ బోల్డ్ యాక్షన్ డ్రామా యానిమల్.
త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కనున్న యాక్షన్ చిత్రం యానిమల్ పార్క్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.
2027లో పార్ట్ 2ను రిలీజ్ చేసుందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇందులో పార్ట్ 1ని మించిన వైలెన్స్ ఉండనుంది.
ఇంకా ఈ సినిమా పార్ట్ 2 సెట్స్ మీదకు కూడా వెళ్లలేదు అప్పుడే పార్ట్ 3 గురించి మాట్లాడుతున్నారు ఆడియన్స్.
తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన రణబీర్, తొలి భాగం సక్సెస్ తరువాత పార్ట్ 3 కూడా చేయాలని ఫిక్స్ అయ్యామన్నారు.
అయితే ఆ సినిమా ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం ఇప్పుడే స్పష్టంగా ఏమి చెప్పలేమన్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరో.
ఇది మాత్రమే కాకుండా యానిమల్ పార్ట్ 3 ఉంటె టైటిల్ బాగుంటుంది అని ట్వీట్ చేసారు సినిమా హీరో రణబీర్ కపూర్.
ఈ ట్వీట్ చుసిన తమకు తోచిన టైటిల్స్ చెబుతూ.. దీన్ని కాస్త వైరల్ చేస్తున్నారు. దీంతో పార్ట్ 3పై చర్చ మొదలైంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడికి సిద్ధం అంటున్న సినిమాలు ఇవే..
ఈ ముద్దుగుమ్మ వంటి అందం ఈ లోకాన దొరకునా.. డెజ్లింగ్ ఆషిక..
ఈ గుమ్మా అందానికి ఆ చందమామ కట్టు బానిస.. గార్జియస్ మిర్న..