అందుకే ఆ వేడుకకు రాలేకపోయాను..  అమితాబ్‌ బచ్చన్‌..

ప్రభాస్‌ హీరోగా చేస్తున్న భారీ చిత్రం  ‘కల్కి 2898 ఏడీ’.

నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్‌కి జోడిగా దీపికా పదుకొనె నటిస్తుంది.

ఇటీవల  ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ వేడుకలో ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమనికి అమితాబ్‌ బచ్చన్‌ తప్ప చిత్రయూనిట్ మొత్తం హాజరైంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు.

వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాలతో ఈ వేడుకకు హాజరు కాలేకపోయానని తెలిపారు.

‘కల్కి 2898 ఏడీ’ ఫస్ట్‌ లుక్‌, స్టైల్‌, మ్యూజిక్‌, ఫ్రేమ్స్‌ ప్రతీది అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు.