సినిమాల స్పీడ్ తగ్గించింది.. సోషల్ మీడియాను ఊపేస్తోంది

10 November 2025

Pic credit - Instagram

Rajeev 

అమలా పాల్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. ఈ అమ్మడు ఎక్కువగా  తమిళం, మలయాళం, తెలుగు సినిమాలతో పాటు కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ 1991 అక్టోబర్ 26న కేరళలోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. అమలాపాల్ అసలు పేరు అనఖ.  

అమలా పాల్ 2009లో మలయాళ చిత్రం నీలతామరతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత తమిళ చిత్రం మైనాలో నటించింది. 

తెలుగులో బెజవాడ (2011)తో ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్. తర్వాత ఇద్దరమ్మాయిలతో, నాయక్, వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. 

ఈ ముద్దుగుమ్మ రన్ బేబీ రన్ (2012), ఒరు ఇండియన్ ప్రణయకథ (2013) చిత్రాలకు SIIMA అవార్డులు, మిలి (2015)కి ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది.

ఇటీవల ది గోట్ లైఫ్ (2024)లో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.

2019లో "మిస్ ఇండియా రన్నరప్"గా నిలిచింది, అలాగే "మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019" మరియు "మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019" టైటిల్స్‌ను గెలుచుకుంది.