ఈ సినిమాలు ప్లాప్.. సాంగ్స్ మాత్రం హిట్..

Prudvi Battula 

17 February 2025

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ఈ జాబితాలో ఉంది. జస్టిన్ ప్రభాకరన్ అందంచిన సంగీతం చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది.

డార్లింగ్ రాముడిగా, కృతి సనాన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ డిజాస్టర్ అయినప్పటికీ.. ఇందులో పాటలు మనుసును హత్తుకున్నాయి.

రామ్ చరణ్ నటించిన ప్లాప్ చిత్రం ఆరంజ్. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ అందించిన మ్యూజిక్ వింటే వావ్ అనాల్సిందే.

రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కనిపించిన ది వారియర్ సినిమా ప్లాప్ అయినప్పటికీ దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి.

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్.. డిజాస్టర్‎గా నిలిచిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకులు ఎమోషనల్‎గా కనెక్ట్ అయ్యారు.

మహేష్ బాబు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి నేనొక్కడినే నష్టాలు మిగిల్చినప్పటికి సాంగ్స్ మాత్రం దుమ్ములేపాయి.

అక్కినేని వారసుడు అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ జంట తెరకెక్కిన హలో ప్లాప్ అయింది. సాంగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి.

బన్నీ కెరీర్‎లో ప్లాప్‎గా నిలిచిన సినిమా బద్రినాథ్. ఈ సినిమా పాటలు మాత్రం సంగీత ప్రియులను మెప్పించాయి.