24 August 2023

బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరో అల్లు అర్జున్

69 వ నేషనల్ అవార్డుల జాబితాని ఈరోజు వెల్లడించగా ఇందులో తెలుగు సినిమాలకు అరుదైన గౌరవం దక్కింది.

2021 వ సంవత్సరానికి గాను సెన్సార్ చేయించుకున్న సినిమాలకు.. ఈ అవార్డుల లిస్ట్ ను ప్రకటించటం జరిగింది.

ఈ లిస్ట్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటుగా ఉప్పెన, పుష్ప, కొండపొలం వంటి సినిమాలకు కూడా నేషనల్ అవార్డులు లభించడం విశేషం.

ఈసారి ఉత్తమ జాతీయ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు లభించింది.

గత 69 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

పుష్ప-పుష్ప ది రైజ్ చిత్రానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ నటుడిగా ఈ అవార్డు లభించింది.

పుష్ప-పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియారేంజ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి విదితమే.

ముఖ్యంగా బాలీవుడ్ సైతం ఈ సినిమా ఊహించని విధంగా రూ.108 కోట్ల వసూళ్లను తెచ్చి రికార్డులు సృష్టించింది.