పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ పాపులారిటీ దక్కించుకున్న ఐకాన్ స్టార్.. తాజాగా నేషనల్ బెస్ట్ యాక్టర్ గా ఎంపికై హిస్టరీ క్రియేట్ చేశారు.
పుష్ప2 నుంచి రిలీజ్ అయిన తన అఫీషియల్ లుక్తో.. ఒక్క సారిగా పుష్ప2 సినిమాపై అంచనాలను పెంచేశారు.
కానీ ఈ లుక్ లోకి ట్రాన్స్ ఫాం అవడానికి ఎంతో ఓపిక తెచ్చుకున్నారు. ఎంతో కష్టపడ్డారు మన ఐకాన్ స్టార్..
పుష్ప2 సినిమాలోని ఓ కీ సీన్లో వచ్చే ఈ లుక్ కోసం.. దాదాపు ఆరు గంటలు కష్టపడ్డారట అల్లు అర్జున్
ఈ గెటప్ కోసం ఫుల్ బాడీ పెయింట్ వేసుకున్నారట. అందుకోసం ఎంతో సేపు నిలుచునే ఉన్నారట అల్లు అర్జున్
అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటరేంటంటే..! ఈ గెటప్ ఒక్కటే కాదు.. ఇంకో రెండు మూడు గెటప్స్‌ను కూడా అల్లు అర్జున్‌తో ట్రై చేయించారట సుకుమార్.
ఫైనల్‌గా... గంగమ్మ జాతర్లో అమ్మవారి లుక్ అల్లు అర్జున్‌కు సెట్ అవ్వడంతో.. దాన్నే ఫైనల్ చేశారట సుకుమార్.
ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ లుక్ .. నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. అల్లు అర్జున్‌ను మరో లెవల్లో ప్రొజెక్ట్ చేసింది. పుష్ప2పై విపరీతమైన అంచనాలు పెంచేసింది.