24 August 2023
ఒకే ఒక్కడు.. తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్
పుష్పరాజ్ అవార్డుల దగ్గర కూడా సత్తా చూపించాడు. 69వ నేషనల్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా బన్నీ ఎంపికై చరిత్ర తిరగరాశాడు
అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు'.. ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో ఇదే జరిగింది
పుష్ఫ సినిమాతో అల్లు అర్జున్ అద్భుతం చేశారు. ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించాడు
టాలీవుడ్ ఒక నటుడు జాతీయ అవార్డు అందుకోవడం 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఇదే ఫస్ట్ టైం.
1997లో నాగార్జున స్పెషల్ జ్యూరీ కేటగిరీలో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. కానీ బెస్ట్ యాక్టర్ గా ఇంతవరకు ఎవరు రాలేదు
తమిళ మలయాళ కన్నడ హీరోలకు అవార్డ్స్ వచ్చాయి కానీ.. ఫస్ట్ టైం బన్నీ జాతీయ అవార్డు అందుకొని సంచలనం సృష్టించాడు
2021లో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సంచలన విజయం సాధించింది. 350 కోట్లకు పైగా వసూలు చేసి అన్ని భాషల్లో అద్భుతం చేసింది ఈ సినిమా
నేషనల్ అవార్డ్స్ విషయంలో కూడా పుష్ప హవా స్పష్టంగా కనిపించింది. కేవలం ఉత్తమ నటుడు కేటగిరీలోనే కాదు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఎంపికయ్యారు
ఇక్కడ క్లిక్ చేయండి..