సరైనోడును తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు తీయబోయే సినిమాని మాత్రం.. స్టేట్స్ దాటించేస్తా అంటున్నారు. ఇక ఈ న్యూస్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోతున్నారు.
నిన్న మొన్నటి వరకు స్కంద సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఎట్ ప్రెజెంట్ ఈ సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.
ఆ సినిమాతో పాటు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ క్రేజీ పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట.
తనకు కెరీర్లో సపోర్ట్ చేసిన బన్నీకి.. భారత్ బాక్సాఫీస్ బద్దలయ్యే రేంజ్లో మరో సూపర్ డూపర్ సినిమాను గిఫ్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.
ఇక అందుకోసమే ఓ స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని.. బన్నీ బాబు చుట్టే తిరుగుతున్నారట ఈస్టార్ డైరెక్టర్.
ఇక రీసెంట్ గా ఈ స్క్రిప్ట్‌విన్న అల్లు అర్జున్ కూడా సూపర్ ఎక్సైట్ మెంట్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట.
కానీ డేట్స్ అడ్జెస్ట్ మెంట్లోనే కాస్త తిరకాసు పెట్టడంతో.. బోయపాటి ఈ సినిమాను వర్కవుట్ చేసే ప్రయత్నాల్లో ఎట్ ప్రజెంట్ బిజీగా ఉన్నారట.
ఇక ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో రీసౌండ్ చేస్తోంది. బన్నీ ఖాతాలో ఆ సారి మరో పాన్ ఇండియన్ మూవీ పడుడు పక్కా అనే కామెంట్ అప్పుడే నెట్టింట వచ్చేలా చేస్తోంది.