సూపర్ డూపర్ హిట్టైన పాన్ ఇండియన్ సినిమాకు సీక్వెల్. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి బన్నీ బర్త్ డే సందర్భంగా బయటికి వచ్చిన ఒకే ఒక వీడియో గింప్స్. దానికి తోడు ఐకానిక్ ఫస్ట్ లుక్.
అంతే.. త్రూ అవుట్ తెలుగు టూ స్టేట్సే కాదు.. త్రూ అవుట్ ఇండియానే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా మారిపోయింది ఐకాన్ స్టార్స్ పుష్ప2 సినిమా.
మరి ఆ రేంజ్ కు వెళ్లిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది.
అందరూ ఊహిస్తున్నట్టు భారీగా కాకుండా.. అందరి ఊహకందనంత భారీగా.. ఇన్‌ఫాక్ట్ అతి భారీగా ఈ బిజెనెస్ లెక్క ఉండడంతో..ఇప్పుడదే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పుష్ప సినిమాకు సీక్వెల్ గా సుకుమార్ డైరెక్షన్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పాన్ ఇండియన్ సీక్వెల్ సినిమా పుష్ప2.
ఇక ఇప్పటికే ఐకాన్ స్టార్ కెరీర్లో ఎవరెస్ట్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ఈసినిమా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ సిటీలో చక్కర్లు కొడుతోంది.
పుష్ప2 సినిమా కోసం బయర్ల మధ్య తీవ్ర పోటీ ఉందట. దాంతో అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్‌ను.. దాంతో పాటే నాన్ థియేట్రికల్ రైట్స్ ను కలుపుకుని ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు బిజినెస్ చేసిందట.
దీనికి మించేలా ఇంకొన్ని భేరసారాలు కూడా జరుగుతున్నాయట. అయితే దాదాపు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈసినిమా ఈరేంజ్ బిజినెస్ చేయడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా వైలర్ అవుతోంది.